విండీస్‌పై గర్జించింది బంగ్లాదేశ్. భారీ లక్ష్యాన్ని ఉఫ్ మంటూ ఉదేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ ధాటికి విండీస్ బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యం ఉన్న విండీస్‌కు విజయాన్ని అందించడంలో విఫలమయ్యారు బౌలర్లు. బంగ్లా బ్యాట్స్‌మెన్ ధాటికి భారీ లక్ష్యం చిన్నబోయింది. కేవలం 41.3 ఓవర్లలో 322 పరుగుల లక్ష్యాన్ని చేధించింది బంగ్లా.
బంగ్లాదేశ్‌కి ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (48: 53 బంతుల్లో 6×4), సౌమ్య సర్కార్ (29: 23 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. వీరికి తోడు షకీబ్ అల్ హసన్ (124 నాటౌట్: 99 బంతుల్లో 16×4) అజేయ శతకంతో చెలరేగగా.. లిట్టన్ దాస్ (94 నాటౌట్: 69 బంతుల్లో 8×4, 4×6) వెస్టిండీస్ బౌలర్లని ఆఖర్లో ఉతికారేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కి అజేయంగా 189 పరుగుల భాగస్వామ్యం చేయడంతో బంగ్లా భౄరీ విజయాన్ని నమోదుచేసుకుంది. ఐదో మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్‌కి ఇది రెండో విజయంకాగా.. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాని ఈ టీమ్ ఓడించిన విషయం తెలిసిందే.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గేల్ తొందరగా వెనుదిరిగిన మరో ఓపెనర్ షైహోప్ (96 ) ఎవిన్ లావిస్ (70), సిమ్రాన్ హెట్‌మెయర్ (50) రాణించారు. దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.