భారత్‌తో టెస్టు సిరీస్..బంగ్లా టీమ్ ఇదే

10
- Advertisement -

భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు జట్టును ప్రకటించింది బంగ్లాదేశ్‌. 16 మంది సభ్యులతో కూడిన టీమ్‌లో షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో జ‌కీర్ అలీని తీసుకున్నారు. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జ‌ర‌గ‌నుండగా ప్ర‌స్తుతం ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు ఆ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాయి. బంగ్లాదేశ్ నాలుగ‌వ స్థానంలో ఉంది.ఇటీవ‌ల ముగిసిన ఆ సిరీస్‌లో 2-0 తేడాతో బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

సెప్టెంబ‌ర్ 19వ తేదీ నుంచి బంగ్లా, భార‌త్ మ‌ధ్య చెన్నైలో టెస్టు సిరీస్ ప్రారంభంకానున్న‌ది. రెండో టెస్టు సెప్టెంబ‌ర్ 27 నుంచి కాన్పూర్‌లో జ‌ర‌గ‌నున్న‌ది.

బంగ్లా జ‌ట్టు:

జ‌న్ముల్ హుస్సేన్ షాంతో, షాద్మాన్ ఇస్లాం, జ‌కీర్ హ‌స‌న్, మొమినుల్ హ‌క్‌, ముష్‌ఫికర్ ర‌హిమ్‌(వికెట్ కీప‌ర్), ష‌కీబ్ అల్ హ‌స‌న్‌, లింట‌న్ దాస్‌, మెహిదీ హ‌స‌న్ మీర్జా, జ‌కీర్ అలీ, త‌స్కిన్ అహ్మ‌ద్‌, హ‌స‌న్ మ‌హ‌మూద్‌, న‌హిద్ రాణా, తైజుల్ ఇస్లామ్,మ‌హ‌మ‌దుల్ హ‌స‌న్ జాయ్, న‌యిమ్ హ‌స‌న్, ఖ‌లీద్ అహ్మ‌ద్‌.

Also Read:వినాయకుడి సేవలో బంగ్లాదేశ్‌ క్రికెటర్..

- Advertisement -