సమ్మెలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లు..

484
bcb
- Advertisement -

బంగ్లాదేశ్‌ క్రికెటర్లు మెరుపు సమ్మెకు దిగారు. 11 డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు బంగ్లా ఆటగాళ్లు. సీనియర్ ఆటగాళ్లు షకీబ్ అల్ హాసన్,మహమదుల్లా,ముషిఫికర్ రెహ్మాన్‌ కూడా సమ్మె చేస్తున్న వారిలో ఉన్నారు.

నవంబర్ 3 నుంచి భారత్‌ టూర్‌కు రావాల్సిఉండగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు సమ్మెబాట పట్టారు. భారత్‌తో టూర్‌కు ముందు బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడం చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్ల డిమాండ్లలో ప్రధానంగా బంగ్లా ప్రీమియర్ లీగ్‌ను పాత ఫార్మాట్‌లో పునరుద్దరించాలని కోరుతున్నారు.

క్రికెటర్లు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించడం తమ దృష్టికి వచ్చిందని బంగ్లా క్రికెట్ బోర్డు సీఈవో నిజాముద్దీన్ తెలిపారు. వీలైనంత త్వరలో వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.అయితే బంగ్లా క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు సమ్మెకు దిగడం ఇదే తొలిసారి.

- Advertisement -