ఆసియా ఉమెన్స్ ఫైనల్లో ఓడి ట్రోఫీని మిస్ చేసుకున్న భారత్. ఏడోసారి కూడా ట్రోఫీ సొంతం చేసుకోవాలనుకున్న భారత్ ఆశలకు బంగ్లా షాక్ ఇచ్చింది . మరోవైపు భారత్‌పై గెలిచి తొలిసారి ట్రోఫీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు బంగ్లా అమ్మాయిలు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, బంగ్లా ముందు స్పల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. కేవలం మూడు వికెట్ల నష్టానికి విజయం నమోదు చేసుకుని ట్రోఫీని సొంతం చేసుకున్నారు బంగ్లా అమ్మాయిలు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాట్స్ మెన్లలో హర్మన్ ప్రీత్‌కౌర్(56: 42 బంతుల్లో 7ఫోర్లు) అర్ధశతకంతో రాణించిగా.. మిథాలీ రాజ్(11), స్మృతి మంధన(7), దీప్తి శర్మ(4) పేలవ ప్రదర్శన చేయండంతో అతి తక్కువ స్కోర్ నమోదు చేసింది. 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ ఒంటి చేత్తో పోరాడింది. బంగ్లా బౌలర్లను ఆమె ఒక్కతే ధాటిగా ఎదుర్కొనగా.. మిగతా బ్యాట్స్మెన్ల సహకారం లభించలేదు. ఇక బంగ్లా బౌలర్లలో తుల్ కుబ్రా(2/23), రుమానా అహ్మద్(2/22) తమ బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేశారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన బంగ్లా బ్యాగ్స్ మెన్లలో సుల్తానా(27), రుమానా అహ్మద్(23), ఆయాషా రహ్మన్(17), షమీమా సుల్తానా(16) తమ వంతు కృషి చేయడంతో బంగ్లా విజయాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. భారత్ బౌలర్లు శికా పాండే, దీప్తి శర్మ, జులన్ గోస్వామిలు తలో వికెట్ తీశారు.