‘బంగారి బాలరాజు’ మూవీ “షురూ..

252
Bangari Balaraju Movie Launch
- Advertisement -

నంది, చల్లా క్రియేషన్స్ బ్యానర్పై కె ఎం డి రఫీ నిర్మాతగా బంగారి బాలరాజు మూవీని రూపొందిస్తున్నారు.. ఈ మూవీకి లవ్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్. రైల్వేట్రాక్ అనే టెలీ ఫిల్మ్తో తొలి చిత్ర ఉత్తమ చిత్ర దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్న కోటేంద్ర దుద్యాల ఈ మూవీకి దరకత్వంతో పాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నిర్మాతగా రఫీ నిర్మిస్తున్న ఈ తొలి చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియో లో బుధవారం లాంచనంగా ప్రారంభమైంది.

 Bangari Balaraju Movie Launch/Opening

నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ మూవీకి క్లాప్ ను గాడ్ ఫాదర్ సాగర్ ఇవ్వగా, యువ హీరో నాగ అన్వేష్ కెమెరా స్వీచ్ ఆన్ చేశారు.. ఈ మూవీ స్క్రిప్ట్ ను సింధూర పువ్వు కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిర్మాత రఫీ, దర్శకుడు కోటేంద్ర స్వీకరించారు.. అనంతరం ఆ చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మీడియాతో మాట్లాడుతూ, . ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నానని తెలిపారు. గత పధ్నాలుగు సంవత్సరాలనుంచి ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్గా, ఆర్టిస్టుగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న తాను డైరెక్టర్గా మారడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దర్శకుడి అవ్వాలనే తన పద్నాలుగు సంవత్సరాల కల, కసి, కష్టం ఈ రోజు నెరవేరిందని తెలిపారు.

ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలని అన్నారు. మొదటి వ్యక్తి వెంకీ చౌదరి, రెండవ వ్యక్తి మహ్మాద్ రఫీ అని తెలిపారు. వారి సహకారం వల్లే తాను ఈ రోజు డైరెక్టర్గా మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ఒక చిన్న టీజర్తో..కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి హీరో, హీరోయిన్ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు.

 Bangari Balaraju Movie Launch/Opening

చిత్రం కథ విషయానికి వస్తే దశాబ్దాలు మారినా, శతాబ్దాలు మారినా ప్రేమ మారదని..ప్రేమికులు మాత్రమే మారుతుంటారని తెలిపారు. చరిత్రలో రోమియో-జూలియట్, సలీం-అనార్కలి, దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచారని ..బంగారి-బాలరాజు వారు కూడా తమ ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోతారా లేక ప్రేమను గెలిపించుకుని చరిత్ర సృష్టిస్తారా అనేదే ఈ చిత్ర కథా సారాంశం అని వివరించారు. తనతోపాటు 18మంది టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారనిఅంటూ వారంతా టీమ్ కాదని తన కుటుంబసభ్యులు, బ్రదర్స్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం నిర్మాత మహ్మద్ రఫీ మాట్లాడుతూ ఈ సినిమాలో కథని ఒక లైన్ తనకు వినిపించారని, అది నచ్చే ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. ఇది ఒక మంచి లవ్స్టోరి అని తెలిపారు. స్క్రిప్ట్, దర్శకుడిపై నమ్మకంతో ఈ చిత్రం చేస్తున్నానని అన్నారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని తెలిపారు.
నటీనటులు – రోహిణి , అజయ్ ఘోష్,అప్పారావు, లేఖన , ఆర్.పి , మహేంద్రనాథ్
సాంకేతిక వర్గం – సంగీతం..చిన్నికృష్ణ-చిట్టిబాబు ఎడ్డిపోగు, కెమెరా..బాబు..జి.ఎల్, ఆర్ట్..కృష్ణమాయ, ఎడిటింగ్..సాయిబాబు-హరి. కో డైరెక్టర్..హేమంత్ కుమార్,కథ,మాటలు,స్ర్కీన్ప్లే, దర్శకత్వం..కోటేంద్ర దుద్యాల, నిర్మాత..కె.ఎమ్డి.రఫి., బ్యానర్- నంది, చల్లా క్రియేషన్స్

- Advertisement -