ఎట్టకేలకు ఐపీఎల్ 15వ సీజన్‌లో బెంగళూరు బోణి కొట్టింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లతో గెలుపొందింది ఆర్సీబీ. 129 లక్ష్యంలో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మూడు ఓవర్లలో వరుసగా రావత్ (0), డుప్లెసిస్ (5), కోహ్లి (12) వెనుదిరిగారు. విల్లీ (18) కూడా ప్రభావం చూపలేకపోయాడు. షహబాజ్ అహ్మద్ (20 బంతుల్లో 27; 3 సిక్స్‌లు) ,దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), హర్షల్ పటేల్ (10 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ (18 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. వనిందు హసరంగ (4/20) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, ఆకాశ్‌దీప్ 3, హర్షల్ 2 వికెట్లు తీశారు.