తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దు:బండ్ల

6
- Advertisement -

తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తనపై జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. చివరి వరకు కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడిన బండ్ల… పత్రికలలో, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. కాంగ్రెస్‌ నాయకులు తనపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికి ఆ పార్టీలో చేరబోనని తేల్చిచెప్పారు.

Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!

- Advertisement -