ఎన్ని జన్మల పుణ్యమో ఇది: బండ్ల గణేశ్‌

53
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీష్ శంకర్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. విడుదలై 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటుండగా నిర్మాత బండ్ల గణేశ్ సైతం సోషల్ మీడియా వేదికగా తన దేవుడు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్ని జన్మల పుణ్య ఫలం ఈ సినిమా నిర్మాణం.. ఈ అవకాశం ఇచ్చిన మా దేవరకు కృతజ్ఞతలు. బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ కు నా ధన్యవాదములు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తీన్మార్‌తో నష్టాల పాలైన బండ్ల గణేశ్‌కు గబ్బర్ సింగ్ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే హరీశ్‌కు ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా కూడా ఇచ్చారు బండ్ల.

- Advertisement -