మంత్రి రోజాకి సన్మానం చేయాలి: బండ్ల గణేష్

102
bandla
- Advertisement -

మంత్రి రోజాకి సన్మానం చేయాలన్నారు సినీ నిర్మాత బండ్ల గణేష్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గణేష్.. రోజాకు విషెస్ చెబుతూ చిత్ర పరిశ్రమ ఆమెకు సన్మానం చేయాలన్నారు. నటిగా ప్రయాణం ప్రారంభించి, రాజకీయాల్లో పోరాడారని గుర్తు చేశారు.

రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం శుభపరిణామమని అన్నారు. రోజాను మంత్రిగా చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని…తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో రంజిత్‌రెడ్డి తనకు మంచి స్నేహితులు అన్నారు. స్నేహానికి, రాజకీయానికి సంబంధం లేదని..అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం తనను బాధించిందన్నారు.

గతంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా బండ్ల గణేష్- రోజా మాధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అది పెద్ద దుమారం చెలరేగగా ఇప్పుడు బండ్ల…రోజాపై ప్రశంసలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -