సీఎం కేసీఆర్.. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా

19
- Advertisement -

బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ఇవాళ ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు బండ్ల. సీఎం కేసీఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అన్నారు. అద్భుతమైన ప్రగతి పధం వైపు తెలంగాణ దూసుకుపోతుందని, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా సరైన మార్గంలో నడిపించే సత్తా, సమర్థత కేసీఆర్‌కు ఉందన్నారు.

భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో కేసీఆర్ ఆలోచన విధానం, కఠోర తపస్సు, ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడిందని, తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కేసీఆర్ దగ్గర ఏదో ఆశించి లబ్ధి కోసమో లేదా స్వార్ధం కోసమే తాను ఈ విషయాలు చెప్పట్లేదని, తన మనస్సులోని మాటలు చెబుతున్నట్లు బండ్ల గణేష్ వెల్లడించారు. మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు అంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -