పవన్‌ డైరెక్షన్‌లో కాంగ్రెస్‌లోకి బండ్ల..!

335
bandla ganesh
- Advertisement -

పవర్ స్టార్,జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. తీసింది తక్కువ సినిమాలే అయినా ఏ హీరోకి ఉండని ఆదరణ పవన్‌ సొంతం. తనదైన మ్యానరిజంతో అభిమానులన్ని సొంతం చేసుకున్నారు పవన్‌. పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేర్లలో ఒకటి బండ్ల గణేష్‌. పలు ఇంటర్వ్యూల్లో పవన్‌ తన దేవుడని..ఆయన కోసం ఏమైనా చేస్తానని బండ్ల బహిరంగంగానే చెప్పారు.

ఇదంతా ఓకే కానీ కొన్నిరోజులగా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎవరికైనా సందేహం రాక మానదు. జనసేన స్ధాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్న పవన్‌కు ఏపీ,తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన బండ్ల….జనసేనలో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేగాదు జనసేన తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

కానీ సీన్ కట్ చేస్తే బండ్ల కాంగ్రెస్‌లో చేరిపోవడం త్వరలో షాద్ నగర్‌ లేదా జూబ్లిహిల్స్ స్ధానం బరిలోకి దిగిపోవడం దాదాపు ఖాయమైంది. అయితే బండ్ల జనసేనలో కాకుండా కాంగ్రెస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో పలు ఉహాగానాలకు దారితీసింది. అయితే పవన్‌ అమోదముద్రతోనే బండ్ల కాంగ్రెస్‌లో చేరారని సన్నిహిత వర్గాల సమాచారం. బండ్ల గణేష్ కు టిక్కెట్టు ఇస్తే – పవన్ గెలుపు బాధ్యతను తీసుకుంటానని కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు గానీ బండ్లకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తే ఆయన గెలుపు నల్లేరుపై నడకే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -