బండ్ల గణేష్‌ మాటలకు పగలబడి నవ్విన పవన్‌..!

305
Bandla Ganeshfunny speech at Katamarayudu pre release function..
Bandla Ganeshfunny speech at Katamarayudu pre release function..
- Advertisement -

ఒకప్పుడు కమెడీయన్ గా మాత్రమే సుపరిచితం. ఇప్పుడు నిర్మాతగా మారిన కూడా తనదైన స్పీచులతో కూడా కామెడీ చేస్తున్నాడు బండ్ల గణేష్‌. కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకి హాజరైన బండ్ల గణేష్ మరోసారి పవన్ భజన చేశాడు. రవి ప్రకాశ్ అంటే నాకు ఇప్పటివరకు ఇష్టం ఉండేది కాదు. ఆయనను ఎప్పుడు కలువలేదు. కానీ తొలిసారి పవన్ గురించి మాట్లాడిన ఆయనను చూస్తే చివరివరకు ఇష్టపడుతాను అని అన్నారు.

ఇక ఈ సారి పవన్ కళ్యాన్‌ని ఏకంగా స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చుతూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశాడు… ఏమని చెప్పను నా దేవుడి గురించి? కళ కళ కోసం ప్రజల కోసం అన్న మహాకవి బళ్ళారి రాఘవ ఆయన అని చెప్పనా? స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతా అన్న బాలగంగాధర తిలక్ అని చెప్పనా? కులం యొక్క పునాథులపై ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేం అన్న అంబేద్కర్ అని చెప్పనా? భారత దేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్ళు అన్నాడు అహ్మద్ ఖాన్.. అలాంటాయనని చెప్పనా? అవసరమైతే చిరిగిన చొక్క తొడుక్కో కాని మంచి పుస్తం కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం పంతులు అని చెప్పనా?

ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పిన లాలా లజపతి రాయ్ అని చెప్పమంటారా? బ్రిటిష్ వాళ్ల పించన్లు తింటూ బ్రతకడం కంటే వీర సైనికుడిలా మరణిస్తా అని చెప్పిన టిప్పు సుల్తాన్ అని చెప్పమంటారా, బెంగాల్ విభజన బ్రిటీష్ ప్రభుత్వ పతనం అని చెప్పిన మహాత్మగాంధీ అని చెప్పమంటారా, నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్ర్యం తెచ్చి ఇస్తాను అని చెప్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పమంటారా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన భగత్ సింగ్ మళ్లీ జన్మించారని చెప్పమంటారా అని ఉద్వేగం ప్రసంగించారు. ఇక చివరగా మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ పవన్ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మరి గణేష్ పూర్తి స్పీచ్ కోసం ఈ వీడియో చూడండి.

- Advertisement -