పవన్‌తో మూవీ…బండ్ల గణేశ్ క్లారిటీ!

75
pawan

రీ ఎంట్రీతో దూసుకుపోతున్నారు మెగాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్‌ హిట్‌తో సక్సెస్ ట్రాక్‌ ఎక్కిన పవన్‌…మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇక పవన్ తిరిగి సినిమాల్లోకి రావడంతో ఆయన బండ్ల గణేశ్‌తో మూవీపై పుకార్లు షికీర్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన తీన్మార్, గబ్బర్ సింగ్‌ హిట్ కావడంతో త్వరలో మూవీ ఉండనుందనే వార్తలు వెలువడుతున్నాయి.

ఖిలాడి చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు జోరుగా సాగుతున్నాయి. దీనిపై బండ్ల గ‌ణేష్ తన ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇందులో ఎలాంటి వాస్త‌వం లేదు. సినిమా ఫైన‌ల్ అయ్యాక నేనే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తాను అంటూ బండ్ల గ‌ణేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.