బండ్ల గణేష్.. BG బ్లాక్‌బస్టర్స్!

6
- Advertisement -

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పదేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమా నిర్మాణ రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయన చివరిసారిగా నిర్మాతగా చేసిన సినిమా 2015లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రం టెంపర్. ఆ తర్వాత దాదాపు దశాబ్ద కాలం పాటు కొత్త ప్రాజెక్టులను నిర్మించకుండా దూరంగా ఉన్నారు.

ఇప్పుడు ఆయన BG బ్లాక్‌బస్టర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఆయన స్థాపించిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తర్వాత వస్తున్న కొత్త బ్యానర్ ఇదే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన బండ్ల గణేష్, నిజాయితీగల కథనం, ప్రదర్శన ఉన్న సినిమాలకు తన బ్యానర్ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.

ఈ ప్రకటనతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బండ్ల గణేష్ కంబ్యాక్ సినిమాకు ఏ నటుడితో కలిసి పని చేయనున్నారనే విషయంపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. త్వరలోనే కొత్త ప్రాజెక్టు వివరాలు వెలువడే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:న్యూజిలాండ్‌తో సిరీస్‌..బుమ్రా,హార్దిక్‌కు విశ్రాంతి!

- Advertisement -