LRS పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్!

13
- Advertisement -

లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.50 వేల కోట్ల దండుకునేందుకు స్కెచ్ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి సీఎం, నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్స్ ను బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. ఇచ్చిన మాట మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని, లేనిపక్షంలో ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను నిండా ముంచింది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని మాట తప్పారు? 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేన్ ఇచ్చి .. వాటిలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. నియామకాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. కానీ ఏకంగా 55 వేల పోస్టులను భర్తీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పోస్టులన్నీ గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల ఫలితమే. యువతకు నెలకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారు. 14 నెలల పాలనలో ఒక్కో నిరుద్యోగికి 56 వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిoచకపోవడంతో 7,500 కోట్ల బకాయిలు పేరుకు పోయినయ్. దీనివల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. 15 శాతం కమీషన్ ఇస్తేనే ఫీజు రీయంబర్స్ మెంట్ బిల్లులు చెల్లిస్తామని కొందరు మంత్రులు చెబుతున్నారట. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా?

ఉద్యోగ, ఉపాధ్యాయులు తొలి పీఆర్సీ జాప్యంవల్ల 21 నెలల పాటు నష్టపోయారు. ఇప్పుడు రెండో పీఆర్సీని నేటికీ అమలు చేయకపోవడంవల్ల 20 నెలలుగా నష్టం జరుగుతూనే ఉన్నా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. 317 జీవో తెచ్చి కేసీఆర్ ప్రభుత్వం చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తే ఈ జీవోను సవరించి న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో అమలు చేసి చర్యలు తీసుకోలేదు. 5 డీఏలు పెండింగ్ లో పెట్టింది. సరెండర్ లీవ్స్ ఎన్ క్యాష్ మెంట్ చేసుకునే అవకాశం లేదు. ఆఖరికి జీతం పైసల్లోంచి దాచుకున్న జీపీఎఫ్, గ్రాట్యుటీ పైసలు కూడా ఇవ్వడం లేదు. పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ పెన్షన్ బకాయిలు మొత్తం కలిపితే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 8 వేల 200 కోట్లు బాకీ పడ్డది. గత ఏడాది(2024లో) 8 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. ఈ ఏడాది మరో 10 వేల మంది రిటైర్డ్ కాబోతున్నరు. వీళ్ల రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ చెల్లించాలంటే 11 వేల కోట్ల రూపాయలు కావాలే… ఇప్పటి వరకు ఒక్కరికి కూడా బెన్ ఫిట్స్ ఇయ్యలేదు అన్నారు.

Also Read:అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్..

- Advertisement -