మోదీ మంత్రమే పనిచేసింది: బండి సంజయ్

1
- Advertisement -

మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందదన్నారు. మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు.. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్ని ఓడిపోయారు అన్నారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ గెలవ లేదు అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల యొక్క వైఫల్యం అన్నారు.

ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందన్నారు. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.తెలంగాణ లోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని…ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో అసంతృప్తి ఉందని చెప్పారు బండి.

Also Read:కాంగ్రెస్ అబద్దాలను కడిగేసిన కాగ్

- Advertisement -