కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టనుండగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు బండి సంజయ్.
బండి సంజయ్ ప్రొఫైల్
బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత ప్రొఫైల్.
పేరు: బండి సంజయ్ కుమార్
పుట్టిన తేదీ: 11-7-1971
తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల.
మతము: హిందువు
కులము: మున్నూరుకాపు,(బి.సి-‘డి’)
భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)
పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్
ప్రస్తుత బాధ్యతలు:
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి
గతంలో చేపట్టిన బాధ్యతలు:
— బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా.
— అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..
–ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్ గా..
–బిజెపి జాతీయ కార్యాలయం,ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా
–భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు.
–శ్రీ ఎల్.కె అద్వానీ గారు చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా..
— కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీ తో హ్యాట్రిక్ విజయం సాధించారు.
— వరుసగా రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షునిగా.
— 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో సాధించారు.
— 2016 లో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు.
— 2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో ప్రథమ స్థానం లో నిల్చున్నారు.
— 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి, టీఆరెస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.
— 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకం (ఇంకా కొనసాగుతున్నారు)
–2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకం (ఇంకా కొనసాగుతున్నారు)
— 2019 టొబాకో బోర్డు మెంబెర్ గా నియామకమై సేవలందించారు.
–2019 మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబెర్ గా నియామకం.
— 2020 ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబెర్ గా నియామకం, (ఇంకా కొనసాగుతున్నారు)
— 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 3 వరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు.
— 2023 జూలై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకం.
— 29 జూలై 2023న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియామకమయ్యారు.
— 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి, 89016 ఓట్లు సాధించి 3163 ఓట్ల తేడాతో ఓటమి
— 2024 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి, 2,25,209 మెజారిటీతో రెండవ సారి ఎంపిగా గెలుపు.
2006 ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు 2,01,581 ఓట్లు రాగా, 2014 లో వినోద్ కుమార్ కు 2,05,007 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఇవే అత్యధిక ఓట్లు కాగా.. తాజా ఫలితాలతో బండి సంజయ్ కుమార్ ఆ రికార్డులను బద్దలు కొట్టి, కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు.
Also Read:తొలిసారి ఎంపీ..కేంద్రమంత్రిగా ఛాన్స్