రాహుల్‌ గాంధీకి బండి సంజయ్‌ సవాల్‌

27
- Advertisement -

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కేంద్రమంత్రి బండి సంజయ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన బండి… తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీగా ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? అని సవాలు విసిరారు.

ఓయూకి వెళ్లి నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలపై మాట్లాడగలరా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాలను గుర్తించి బీజేపీకి 8 ఎంపీ సీట్లు అందించారని చెప్పారు.

తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తుందని…రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అన్నారు.

Also Read:కమీషన్లు తప్ప పాలనపై దృష్టి ఏది?

- Advertisement -