అంతరించిపోనున్న అరటిపండ్లు..!

458
banana fungus
- Advertisement -

పేదవాడి దగ్గరి నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పండు అరటి పండు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎలాంటి రోగం ఉన్నా అరటి పండు మేలు చేస్తుంది అంటారు. ఇలా మేలు చేసే అరటిపండ్లు భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.

టిఆర్4 అనే ఫంగస్ స్పీడ్ గా వ్యాపిస్తోంది. అరటి తోటలను సాగు చేసేందుకు వినియోగించే ట్రాక్టర్ టైర్ల ద్వారా, పొలంలో తిరిగే మనిషి బూట్ల ద్వారా ఈ ఫంగస్ వ్యాపిస్తోంది. ఒక్కసారి ఈ వైరస్ అరటి పొలంలోకి వ్యాపించింది అంటే.. పంట మొత్తం నాశనం అయినట్టే.

ఈ వైరస్‌తో కొలంబియా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కొలంబియా వ్యవసాయ విద్యాలయం(ఐసీఏ) ఈ మేరకు హెచ్చకరికలు జారీ చేసింది. దాదాపు 175 హెక్టార్ల పంటకు ఈ వైరస్ సొకిందని తెలిపింది.

ప్రపంచంలో దాదాపు 1000 కి పైగా అరటి జాతులు ఉంటె అందులో 300 జాతులు మనిషి తినేందుకు అనువుగా ఉంటాయి. అందులోను కావెండిష్ అరటి ప్రత్యేకమైనది. ప్రపంచంలో దీనినే ఎక్కువగా సాగు చేస్తుంటారు. అయితే అరటిపండు వైరస్‌తో కావెండిష్ ఇకపై దొరకడం కష్టమే.

ముఖ్యంగా ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా, ఆస్ట్రేలియా, మధ్య ఆసియా తదితర ప్రాంతాల్లో ఈ వైరస్‌ ధాటికి అరటిపళ్లు నాశనమవుతున్నాయట. ఈ సమస్యకు సత్వరమే స్పందించుకుంటే త్వరలోనే అరటి తుడిచిపెట్టుకుపోయే దశకు చేరుకుంటుందని అంతర్జాతీయ ఆహార సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది

- Advertisement -