అమెరికన్ ఇండియన్ కమ్యూనిటీ మరియు అమెరికన్ ఫ్రెండ్స్ అఫ్ బలూచిస్తాన్ కలిపి నిర్వహించిన “నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్ ” దిగ్విజయంగా జరిగింది. పాకిస్థాన్శం టెర్రిరిజం కి నిధులు అందిచడం , మైనారిటీలైన హిందువులు, సిక్కులు, బలూచిస్తాన్ మీద భౌతిక దాడులు చేయటం లాంటి వాటిపైన నిరసన చేపట్టారు.
పాకిస్థాన్ దేశం, టెర్రిరిజంని మిగితా దేశాలకు పంపడం , కాశ్మీర్ / ఉరి లో ఆర్మీ ఫై జరిగిన దాడి, న్యూ యార్క్ ,న్యూ జెర్సీ లో జరిగిన బాంబుల కుట్ర వెనుక నిందితుడు పాకిస్థాన్ తో సంబంధాలు ఉండడం , పాకిస్థాన్ దేశం ను – టెర్రిరిజం దేశం గా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి ని డిమాండ్ చేశారు . పౌరులపై పాశవిక దాడుల కుట్రలన్నీ కూడా పాకిస్థాన్‌లోనే జరుగుతున్నాయని పలు దేశాలు కూడా ప్రకటించాయి . ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి ఏనుగుల, అడపా ప్రసాద్ , జయేష్ పటేల్ , విలాస్ రెడ్డి జంబుల, నీలిమ మదన్ , శ్రీకాంత్ తుమ్మల, ఫణి భూషణ్ , రామ్ వేముల , బాల గురు , ఆనంద్ , రవి తదితరులు పాల్గొన్నారు.