బ్యాలెట్‌ విధానం ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు…

201
telangana cec

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగనున్నాయని తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించామని మెజార్టీ రాజకీయ పార్టీలు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కోరాయని వెల్లడించారు.

గుర్తింపు పొందిన, న‌మోదైన‌ 50 పార్టీల్లో 26 పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను తెలిపాయని….. 13 పార్టీలు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపగా ఈవీఎంల ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని 3 పార్టీలు కోరాయని వెల్లడించారు.