భళా అనిపిస్తున్న రానా..

299
Ballala Deva Rana new poster
- Advertisement -

‘బాహుబలి : ది కన్‌క్లూజన్‌’ కోసం సినీ అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. 2015లో విడుదలైన ‘బాహుబలి : ది బిగినింగ్’ ఓ ప్రశ్నను మిగిల్చింది. అదే ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడ’నే మిస్టరీ. రెండేళ్ల తర్వాత ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న రెండో భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుందని అందరి ఆతృత.

ఇక ‘బాహుబలి: ది బిగినింగ్’కు సంబంధించి విడుదలకు ముందు అప్పట్లో రిలీజ్ చేసిన ఒక్కో పోస్టర్ ఎంత చర్చనీయాంశమయ్యాయో గుర్తుండే ఉంటుంది. వాటిలో శివుడి లుక్ తర్వాత అత్యంత ఆకట్టుకున్నది భల్లాలదేవుడి పోస్టరే.

Ballala Deva Rana new poster

తాజాగా రిలీజైన రానా పోస్టర్ మాత్రం వావ్ అనిపించక మానదు. భల్లాలదేవగా రానా అదిరిపోయే రేంజ్‌లో కనిపిస్తాడన్న విషయం ఈ పోస్టర్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. “ఎవరితోనూ పోల్చడానికి కూడా అందనంత బలశాలి, ఎవరూ ఎదిరించలేనంత శక్తిమంతుడు, ఎవరి ఊహకూ అందని తెలివైనవాడు” అంటూ భల్లాల దేవ గుణగుణాలను వర్ణిస్తూ రాజమౌళి ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎప్పట్లానే ఈ పోస్టర్‌ కూడా సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ అయింది. బ్యాగ్రౌండ్లో సింహాల బొమ్మలు కూడా ఈ పోస్టర్ని మరింత ఎలివేట్ చేశాయి.

కొన్ని కొన్ని రోజుల విరామంతో ఇలాగే ఇకపై రిలీజ్ ముందు వరకు సినిమాలోని ముఖ్య పాత్రధారుల లుక్స్ ఒక్కోటి రిలీజ్ చేస్తారట. ‘ది బిగినింగ్’ విడుదలకు ముందు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అది మంచి ఫలితమే ఇచ్చింది. ‘ది కంక్లూజన్’ మీద ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ఇప్పుడు ఈ పోస్టర్ల తాకిడితో ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయం.

ఇక బాహుబలి 2′ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ, శివగామి – దేవసేన పాత్రలను గురించి ప్రస్తావించాడు. ‘బాహుబలి’ మొదటిభాగంలో శివగామి పాత్ర చాలా బలమైనదిగా కనిపించిందనీ, రెండవ భాగంలో శివగామితో పాటు దేవసేన పాత్ర కూడా బలమైనదిగా కనిపిస్తుందని చెప్పాడు. ఈ రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయని అన్నాడు.

- Advertisement -