ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సభకు భారీగా జన సమీకరణ చేయనుండగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది బీఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా మందమర్రిలో రజతోత్సవ వేడుకల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ బహిరంగ సభ కుంభమేళాకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. మహిళలకు 2500 నెలకు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వడం లేదని, రూ.15వేల రైతు భరోసా అందడం లేదని, రూ.4వేల పింఛన్ అమలు కావడం లేదని, అలాంటి కాంగ్రెస్ సర్కార్ ను నిలదీయాలన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
చెన్నూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు సుమన్. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని, గద్దెనెక్కి 17నెలలు గడిచినా హామీల అమలు మాత్రం జరగడం లేదన్నారు.
Also Read:శర్వా సినిమాలో అనుపమ!

