చెన్నూర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే బాల్క సుమన్..

317
balka suman
- Advertisement -

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ముత్తారావుపల్లి గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే బాల్క సుమన్. కరోనా వైరస్ తో ఈ నెల 14 న లక్ష్మి మృతి చెందగా నిన్న రిపోర్ట్స్ పాజిటివ్ రాగా ఈ రోజు ముత్తరావుపల్లి గ్రామాన్ని సందర్శించి దగ్గర ఉండి ఎనిమిది మంది కుటుంబాల వారితో మాట్లాడి క్వారంటైన్ కేంద్రానికి పంపించడం జరిగింది.

అదికారులకు పారిశుధ్యం మరియు నిత్యావసరాలలో కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికెరీ గారు,రామగుండం పొలీస్ కమిషనర్ సత్యనారాయణ గారు,ఎమెల్సీ పురాణం సతీష్ ,ఇంఛార్జ్ డీఎంహెచ్ఒ. నీరజ ,మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి , జైపూర్ ఎసీపీ నరేందర్ , స్థానిక వైద్య సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -