పెద్దల కోసమే విద్యుత్ సంస్కరణలు: బాల్క సుమన్

96
suman
- Advertisement -

కొద్దిమంది కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే బాల్క సుమన్. అసెంబ్లీలో కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు-పర్యవసానాలపై జరిగిన చర్చలో మాట్లాడిన సుమన్…కేంద్ర కుట్రలు ప్రజలకు తెలియాలన్నారు. ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రంలో వ్యసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీని దేశం నుంచి వెళ్లగొట్టే నాయకత్వాన్ని కేసీఆర్ చేపట్టాలని యావత్‌ దేశం కోరుకుంటున్నదని చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, కరెంటు సరిగా లేక వ్యవసాయం, పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయామన్నారు. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.

- Advertisement -