కిష‌న్ రెడ్డి ద‌ద్ద‌మ్మ‌…బాల్క సుమ‌న్ ఫైర్!

132
balka suman
- Advertisement -


కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై ప్ర‌భుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. కిష‌న్ రెడ్డి ఒక ద‌ద్ద‌మ్మ‌లా మాట్లాడుతున్నార‌న్నారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ ద‌యాక‌ర్, ఎమ్మెల్యే జాజుల సురేంద‌ర్‌తో క‌లిసి బాల్క సుమ‌న్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేని కిష‌న్ రెడ్డి ఒక దద్దమ్మవి అని విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. తెలంగాణ‌కు కేంద్రం మోసం చేస్తుంటే పెద‌వులు మూసుకుని కూర్చుంది కిష‌న్ రెడ్డి కాదా? అని ప్ర‌శ్నించారు.

ఇతర రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణ ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఎందుకివ్వ‌రు.. దీనిపై కిష‌న్ రెడ్డి పెద‌వి విప్ప‌రు. అన్నిట్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని బాల్క సుమ‌న్ డిమాండ్ చేశారు.

నల్ల చట్టాలతో రైతుల ఉసురు పోసుకుంది మోదీ కాదా? దేశంలో నిరుద్యోగాన్ని చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పెంచింది మోదీ కాదా? రూపాయి విలువ దేశ చరిత్రలోనే అత్యంత కిందకు దిగజార్చిన మోదీ మోసగాడు కాదా? దేశాన్ని తన దోస్తులకు అమ్ముకుంటూ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలో పడేసింది మోదీ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే దొంగలముఠా అని విమర్శించారు.

- Advertisement -