Balka Suman: హైడ్రా పేరుతో వసూళ్ల దందా

10
- Advertisement -

రాష్ట్రంలో ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏవీ నెరవేర్చలేదు అని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్..తొమ్మిది నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు అన్నారు. జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రంగా ప్రకటించారని..తెలంగాణ సుపరిపాలన లేదు..దరిద్రపు పాలన నడుస్తోందన్నారు.

ఈ ప్రభుత్వం రుణ మాఫీ చేసింది కేవలం 17వేల 933 కోట్లు మాత్రమేనని..ఎంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయనేది ఇంత వరకు ప్రకటించలేదు అన్నారు. రుణ మాఫీ పచ్చి మోసం,దగా…ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడన్నారు.

సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం…హైడ్రా డ్రామాలు అన్నారు. అర్హత లేని వాళ్ళు అందలం ఎక్కారు…ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీది ఒక విధానం…రేవంత్ రెడ్డికి ఇంకో విధానమా…హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్..తమ్మడి కుంట ఎఫ్ టీఎల్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్ లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదు అని ప్రశ్నించారు. నాగార్జునను 400 కోట్లు డిమాండ్ చేశారు…ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్ లను కూల్చరు…ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అన్నారు.

Also Read:Trump: త్వరలో మోడీని కలుస్తా

- Advertisement -