న‌యా దేశ్‌ముఖ్..రేవంత్ రెడ్డి

18
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి నయా దేశ్‌ముఖ్ అన్నారు బీఆర్ఎస్ బాల్క సుమన్. దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలన్నారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన బాల్క.. గ‌తంలో ఎన్న‌డూ ఇలా లేదు అన్నారు. ఎస్సీల‌కు డిప్యూటీ సీఎం, మంత్రి ప‌ద‌వి ఇచ్చి పెద్ద‌పీట వేసిన‌ట్లు ప్ర‌చారం.. కానీ ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చే వ‌ర‌కు కాళ్ల ద‌గ్గ‌ర కూర్చోబెట్టుకోవ‌డం కాంగ్రెస్ సంప్రదాయం అన్నారు.

గ‌తంలో కుల సంఘం మీటింగ్‌లో పాల్గొని మేమే ప‌రిపాల‌న చేయాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, బీసీలు పాలించ‌బ‌డేటోళ్లు. మేం దేశ్‌ముఖ్‌లం.. పాలించేటోళ్లం అని రేవంత్ చెప్పారు. ఇవాళ అది ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్నూర్ రామ‌చంద్రారెడ్డి, ఎర్ర‌పాడు ప్ర‌తాప్ రెడ్డి లాంటి దేశ్‌ముఖ‌ల కోవ‌లేనే ఈ న‌యా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచ‌న, ఆచ‌ర‌ణ ఉంద‌న్నారు. వాటికి నిద‌ర్శ‌న‌మే ఇవాళ్టి సంఘ‌ట‌న‌ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ద‌ళితుడిని నియ‌మించామ‌ని చెప్ప‌డం కాదు.. ఇక్క‌డ ద‌ళిత ఉప ముఖ్య‌మంత్రికి ఈ స్థాయిలో అవ‌మానం జ‌రుగుతంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Also Read:క్యారీ ఒంటరిపోరాటం..ఆసీస్ అద్భుత విజయం

- Advertisement -