- Advertisement -
బీజేపీ నేత బండి సంజయ్‌పై మరోసారి మండిపడ్డారు ఎమ్మెల్యే బాల్క సుమన్. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్…సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ వచ్చాక సింగరేణిలో 14 వేల ఉద్యోగులు ఇచ్చామని, సిగరేణి లాభాల్లో వాటాను 28 శాతం పెంచామని బాల్కా సుమన్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని.. 2014 జూన్ 14న అసెంబ్లీ తీర్మానం చేసిందని.. దీనిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు.
- Advertisement -