రేవంత్…దేశద్రోహి:బాల్క సుమన్

341
balka suman
- Advertisement -

టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దేశద్రోహి అని మండిపడ్డారు ఎంపీ బాల్క సుమన్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సుమన్..రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తులసి వనంలో గంజాయి మొక్క అని దుయ్యబట్టారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ జైల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ అన్నారు. ఒక్కొక్కరి అవినీతి బాగోతం బయటపడుతుంటే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని చెప్పారు. ఆర్ధిక ఉన్నాది రేవంత్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దావూద్ ఇబ్రహీం, చోటాషకీల్‌కు ఏమాత్రం తగ్గని వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు.

కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని ప్రచారం చేయడం సబబు కాదని తెలిపారు సుమన్. ఐటీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదని…టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేసినా టీఆర్ఎస్‌ గెలుపును అడ్డుకోలేరని కుండబద్దలు కొట్టారు.

- Advertisement -