రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఉత్త కూమారులా ప్రగాల్భాలు పలుకుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హూజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజెందర్ విశ్వాస ఘాతకుడని మండిపడ్డారు. ఆయన తిన్నింటి వాసాలను లెక్కబెట్టారన్నారు. 2004కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకుంటే ఈటెల ఎక్కడి వాడని మండిపడ్డారు. ఈటెలను మంత్రి చేసింది కేసీఆర్ కదా? అని సుమన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానందతో కలిసి బాల్క సుమన్ టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు.
ఈటెల శిఖండి రాజకీయాలు చేస్తున్నారని సుమన్ పేర్కొన్నారు. ఆయన మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్‌లో రాజేందర్ ఓటమి ఖాయమన్నారు. అందుకే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని పగటి కలలు కంటున్నట్టున్నారు. ఆయన ఓ చెల్లని రూపాయి అని విమర్శించారు. పబ్లిసిటీ కోసమే ఈటెల ఈ తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీలో ఈటెలది బానిస బతుకు అని తెలిపారు.