16 మీడియా ఛానళ్లపై ఫిర్యాదు:బాల్క సుమన్

8
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేసే న్యూస్ ఛానళ్లు, వార్తా పత్రికలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిపైనా కేసులు వేసి చట్టపరంగా ఎదుర్కుంటాం అన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ తరఫున బాల్క సుమన్‌ ఫిర్యాదు చేశారు.

అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సుమన్…లిక్కర్‌ స్కాం కేసులో కేసీఆర్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో పాటు పలు మీడియా ఛానళ్లు అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో 16 న్యూస్‌ ఛానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. నిర్ధారణ చేసుకున్న తర్వాతే వార్తలు ప్రసారం చేయాలని సూచించారు.

కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సుమన్‌ కోరారు.లిక్కర్‌ స్కాం కేసులో కేసీఆర్‌ పేరును ఈడీ ప్రస్తావించినట్లు నిరాధార ఆరోపణలను కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయని తెలిపారు.

Also Read:రాకింగ్‌ రాకేశ్‌.. ‘కేసీఆర్‌’

- Advertisement -