Balapur:బాలాపూర్ లడ్డూ@35 లక్షలు

9
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. వేలం పాటలో గణనాథుని లడ్డూని లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ కోసం 31 మంది పోటీపడ్డారు.

ఈ ఏడాది కొత్తగా వేలంపాట పోటీలోకి చంపాపేట్ కు చెందిన మర్రి కిరణ్ రెడ్డి, జిట్టా పద్మ సురేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, కొత్తగూడెంకు చెందిన సామ రామ్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన పీఎస్కే గ్రూప్స్ ప్రధానంగా పోటీపడ్డారు.

ఇక పదేళ్ల నుంచి లడ్డూని సొంతం చేసుకుంటోంది కొలన్ ఫ్యామిలీ, గత ఏడాది రూ.30,01,000లకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. గత 31 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ వేలం జరుగుతోండగా 1994లో తొలిసారి వేలంలో రూ.450 పలికింది లడ్డూ. గతేడాది కంటే రూ.35 లక్షలు ఎక్కువ ధర పలికింది లడ్డూ.

Also Read:SIIMA:సైమా ఉత్తమ నటుడిగా బన్నీ

- Advertisement -