సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన శాతకర్ణి రికార్డు వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా విజయవిహారం చేసింది. ఓవరాల్‌గా సినిమా విడుదలైన తొలి నాలుగు రోజుల్లో శాతకర్ణి రూ.35 కోట్ల షేర్‌తో పాటు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో బాలయ్య సినిమాలు గతంలో ఎప్పుడూ మిలియన్ మార్క్‌ను టచ్ చేయలేదు. శాతకర్ణి కేవలం నాలుగు రోజులకే 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.ఇది బాలయ్య కేరీర్‌లోనే తిరుగులేని రికార్డుగా నిలిచింది.
తన 100వ చిత్రం చారిత్రక నేపథ్యంతో కూడిన చిత్రం కావడం .. దానికి విశేషమైన స్థాయిలో ఆదరణ లభించడం బాలకృష్ణకి ఎంతో సంతోషాన్నీ .. సంతృప్తిని కలిగించాయి. దీంతో బాలయ్య ఈ ఆనందాన్ని శాతకర్ణి టీమ్‌తో పంచుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమా కోసం కష్ట పడిన ప్రతి ఒక్కరినీ ఆయన విందుకు ఆహ్వానించారని చెబుతున్నారు. రేపు ఒక స్టార్ హోటల్లో ఈ విందు ఉండనుందని సమాచారం.
గౌతమీ పుత్ర శాతకర్ణి విజయంతో ఖుషీగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో తీపి కబురు అందుతోంది. చాలా రోజులనుంచి బాలయ్య నట వారసుడు గా అతని తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. మొత్తంగా శాతకర్ణి విజయం బాలయ్యకు మర్చిపోలేని జ్ఞాపకాన్నే మిగిల్చింది.