‘సర్కార్‌ 3’ సెట్‌లో ‘శాతకర్ణి’

245
- Advertisement -

రాంగోపాల్ వర్మ షూటింగ్ అంటేనే అదొక సెన్సేషన్. ఇటీవలె సర్కార్‌ 3 సినిమాని స్టార్ట్ చేసిన వర్మ…అందులోని పాత్రలను ట్విట్టర్ ద్వారా పరిచయం చేశాడు. ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌కు అవకాశం లేదని తెలిపాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు వర్మ. ఈ నేపథ్యంలో సర్కార్‌ 3 షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లో బాలయ్య సందడి చేశాడు.

balakrisha

బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు ముంబైలో చిత్రీకరణను జరుపుకుంటుడగా, అక్కడే బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ కూడా సర్కార్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ ‘సర్కార్‌ 3’ సెట్‌కు వెళ్లి సందడి చేశారు. అక్కడ అమితాబ్‌ను కలిసి అతడితో కాసేపు ముచ్చడించాడు.

ఈ సందర్భంగా ‘శాతకర్ణి’ సినిమా విశేషాలను అమితాబ్‌కు చెప్పారు. ఆ విషయాలను ఎంతో ఆసక్తితో విన్న అమితాబ్, ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న బాలకృష్ణను ప్రశంసించారు. అటు బాలయ్య.. రామ్ గోపాల్‌వర్మను మరికొందరి నటీనటులను కలిసి మాట్లాడారు.

amithab

ఎన్టీఆర్ కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్యతో బిగ్-బికి మంచి సంబంధాలుండేవి. కానీ ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య ఎలాంటి కలయిక జరగలేదు. ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ మాట్లాడింది లేదు. అమితాబ్ హైదరాబాద్ వచ్చినపుడు చిరంజీవి.. నాగార్జున లాంటి వాళ్లను కలిశాడు తప్ప బాలయ్యతో మీట్ అయిన సందర్భాలు కనిపించలేదు. దీంతో బాలయ్య….ముంబైలో సర్కార్‌ 3 షూటింగ్‌లో బిగ్ బిని కలిసి సరదాగా కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది.

balakrishna

- Advertisement -