బాలయ్య చెప్పేశాడుగా

114
nbk
- Advertisement -

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అవ్వబోతుంది. జనవరి 12 న సినిమా థియేటర్స్ లోకి రానున్నట్లు ఇప్పటికే టాక్ వచ్చింది. తాజాగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో రిలీజ్ డేట్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ముందునుండి చక్కర్లు కొడుతున్నట్టే జనవరి 12నే వీర సింహా రెడ్డి థియేటర్స్ లోకి రాబోతుంది. అఖండ తర్వాత బాలయ్య నుండి క్రాక్ తర్వాత గోపీచంద్ నుండి వస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్ ఉన్నాయి.

సంక్రాంతికి ఇప్పటికే బాలయ్య చాలా సినిమాలు రిలీజయ్యాయి. వచ్చే ఏడాది కూడా బాలయ్య తన సంక్రాంతి సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. టీజర్ టాక్ బాగుంది కానీ ఫస్ట్ సింగిల్ కి అనుకున్నంత రెస్పాన్స్ దక్కలేదు. ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. సంక్రాంతి సినిమాల్లో బాలయ్య రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -