మరోసారి గాయకుడిగా బాలయ్య..!

7
- Advertisement -

నందమూరి బాలకృష్ణ మరోసారి గాయకుడిగా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో ‘పైసా వసూల్’ చిత్రం కోసం ‘అరె మామా ఏక్ పెగ్‌లా’ అనే ప్రత్యేక పాటను స్వయంగా పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య, ఇప్పుడు మరోసారి తన గాత్రంతో వెండితెరపై వినిపించనున్నారు. నటుడిగానే కాదు, గాయకుడిగానూ తన ప్రత్యేకతను చూపించగల బాలయ్య ఈసారి కూడా అదే ఉత్సాహంతో ముందుకొస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న కొత్త సినిమాలో బాలకృష్ణ పాట పాడనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం బాలయ్య వాయిస్‌తో ఒక మాస్ పాటను రూపొందిస్తున్నామని, అది అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తమన్ వెల్లడించారు. బాలయ్య ఎనర్జీకి తగ్గట్లుగా ఈ పాట ఉంటుందని కూడా తెలిపారు.

ఇప్పటికే NBK111 సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు బాలయ్య గాత్రం కూడా ఉండడంతో ఆసక్తి మరింత పెరిగింది. గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. నటనతో పాటు గానం ద్వారా కూడా ప్రేక్షకులను అలరించడంలో బాలయ్య మరోసారి సక్సెస్ సాధిస్తారని అభిమానులు విశ్వసిస్తున్నారు.

Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

- Advertisement -