సీనియర్ టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన అఖండ 2: తాండవం విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఈ సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో బాలయ్య-క్రిష్ కాంబినేషన్‌లో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తరువాత హ్యాట్రిక్ కాంబినేషన్ అవుతుంది. ఈ సినిమాను 2025 అక్టోబర్ 2న విజయదశమి సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇక బాలయ్య ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక పాన్-ఇండియా భారీ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా విజయదశమి రోజున లాంచ్ కానుంది. బాలయ్య గోపీచంద్ మలినేని, క్రిష్ చిత్రాలను ఒకేసారి షూట్ చేయనున్నారని టాక్.
Also Read:Mirai:మిరాయ్ డే1 వసూళ్లు

