- Advertisement -
సినీ నటుడు బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. స్వల్ప అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు బాలకృష్ణ. గత రెండు మూడు రోజుల్లో నన్ను కలిసినవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
బాలకృష్ణకు కరోనా అని వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. దసరా కానుకగా మూవీ విడుదల చేయాలని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2కి ఆయన సిద్ధం అవుతున్నారు.
- Advertisement -