- Advertisement -
ఆస్ట్ర్రేలియా సిడ్నీలో జరగనున్న తెలుగు అసోసియేషన్ రజతోత్సవ వేడుకుకు ముఖ్య అతిథిగా వెళ్లనున్న ప్రముఖ నటుడు బాలకృష్ణ. ఏప్రిల్ 7న జరగునున్న ఈ కార్యక్రమంలో తెలుగు భాష గొప్పదనాన్ని, కీర్తిని ఖండాలు దాటించి సంబురాలు అంబరాన్నంటేలా చేద్దామని వీడియో ద్వారా బాలయ్య తెలియజేశారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి పలు ఉత్సవ వేడుకలని ఘనంగా నిర్వహిస్తూ అందులో పాలు పంచుకుంటున్నారు.
ఇటీవల లేపాక్షి ఉత్సవాలని ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జరిగిన లేపాక్షి ఉత్సవంలో బాలయ్య శ్రీకృష్ణ దేవరాయల, కృష్ణుడి వేషధారణలో కనిపించి కనువిందు చేశారు. తాజాగా తేజ దర్శకత్వంలో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను ఘనంగా లాంచ్ చేశారు. ఈ మూవీని మేలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ బయోపిక్ లో బాలయ్య 64 పాత్రలలో కనిపించునున్నట్లు తెలుస్తుంది.
- Advertisement -