- Advertisement -
నందమూరి బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ టాక్ షో అన్‌స్టాపబుల్ 2 కోసం పవన్ కళ్యాణ్ ఇటీవల షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవ్వాళ టెలికాస్ట్ అవ్వబోతున్న ఈ షోలో పవన్ తో కలిసి నిధి అగర్వాల్ కాసేపు మెరిసిందట.
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా కనిపించనుందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో నిధి వీడియో కాల్‌లో పాల్గొంటుంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ లో నిధి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎపిసోడ్‌లో హరిహర వీరమల్లు గురించి కూడా చర్చించనున్నారు. ఆ సమయంలో నిధి వీడియో కాల్ ద్వారా కాసేపు బాలయ్య అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది.
ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటల నుండి ఆహా వీడియోలో ప్రసారం చేయడానికి సెట్ చేశారు. ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇవి కూడా చదవండి…
సక్సెస్ మీట్..రైటర్ పద్మభూషణ్
ఎన్టీఆర్ సినిమా పై బిగ్ అప్ డేట్
మైఖేల్ విజువల్ గ్రాండియర్:సందీప్
- Advertisement -