బాలయ్య సీరియస్.. పాపం బాబీ

20
- Advertisement -

బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబినేషన్ సినిమా షూట్ నాన్ స్టాప్ గా స్టార్ట్ చేయాలని.. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ దగ్గర నుంచి దర్శకుడు బాబీ అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఐతే, బాలయ్య మాత్రం తనకు డైలాగ్ వెర్షన్ తో సహా ఫుల్ స్క్రిప్ట్ వినిపించాలని సూచన చేశాడు. సో.. బాలయ్య కోరిక మేరకు దర్శకుడు బాబీ తన రైటింగ్ టీమ్ ను ఫుల్ స్క్రిప్ట్ ఎక్స్ ప్లేన్ చేయమని పంపాడు. సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నది సామెత. బాబీ ఇష్టపడి రాయించుకున్న డైలాగ్ లు, బాలయ్యకి నచ్చకపోవడంతో ఆ రైటింగ్ టీమ్ పై బాలయ్య తన విసుర్లు విసిరాడు.

బహుశా బాబీ కూడా ఇదే జరుగుతుంది అని ఊహించొచ్చు. అందుకే, తెలివిగా తను తప్పుకుని తన టీమ్ ను పంపాడు. ఐతే, దర్శకుడు బాబీ విషయంలో కూడా బాలయ్య చిర్రుబుర్రులాడారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో రచయిత కోన వెంకట్ ను అసలు ఇన్ వాల్వ్ చెయ్యొద్దు అని బాలయ్య ముందే చెప్పాడు. కానీ, కోన వెంకట్ దర్శకుడు బాబీకి గురువు లాంటి వాడు. అందుకే, బాలయ్య ఈ విషయంలో చిర్రుబుర్రులాడినా బాబీ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత అవన్నీ సర్దు మణిగాయి.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్క్రిప్ట్ విషయంలో మాత్రం బాలయ్య చాలా సీరియస్ గా ఉన్నాడు. లేటెస్ట్ గా నిన్నటికి నిన్న కూడా స్క్రిప్త్ వర్క్ పై బాలయ్య చిందులు తొక్కారని టాక్. దర్శకుడు బాబీ తన మాటను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు అని, ఆ కోపం అలా అలా బాలయ్య స్క్రిప్ట్ మీద చూపించారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. పాపం బాబీ.. బాలయ్య కాస్త పరుషంగా మాట్లాడినా.. మౌనంగా ఉండటం తప్ప చేసేదేం లేదు.

Also Read:‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ పరిస్థితేంటి ?

- Advertisement -