బాలకృష్ణ…. రూల‌ర్‌ ఫ‌స్ట్ లుక్

568
nbk
- Advertisement -

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి `రూల‌ర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

బాల‌కృష్ణ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న ఖాకి యూనిఫాంలో ఉన్న లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అలాగే గ‌డ్డంతో పాటు డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్లోనూ ఆయ‌న క‌న‌ప‌డుతూ.. చేతిలో సుత్తి ప‌ట్టుకుని ఉన్నారు. బాల‌కృష్ణ డిఫ‌రెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్ర‌ను పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతుంది. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -