నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం `రూలర్`. ఈ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఆదివారం దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
ఆయన ఖాకి యూనిఫాంలో ఉన్న లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే గడ్డంతో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైల్లోనూ ఆయన కనపడుతున్నారు. బాలకృష్ణ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు బాలయ్య పోలీస్ గెటప్‌లో మరోలక్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.