రైతుగా మారబోతున్న బాలయ్య..!

224
Balakrishna
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం పూర్తి కాకముందే మరో చిత్రంపై దృష్టి పెట్టాడు బాలయ్య.. ఇది ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ ప్రాజక్టు క్యాన్సల్‌ అయిందంటూ ఇటీవల కొంత ప్రచారం జరిగినప్పటికీ, అదంతా ఒట్టిదేనని అంటున్నారు. ఈ మూవీ సంబంధించిన వర్క్‌ జరుగుతుందని సమాచారం.

ఇక బి.గోపాల్ రూపొందించే చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. రైతు సమస్యల నేపథ్యంలో ఇది ఉంటుందట. దీనికి సంబంధించిన స్క్రిప్టు పని ప్రస్తుతం జరుగుతోంది. పవర్ ఫుల్ డైలాగులు రాసే బుర్రా సాయిమాధవ్ ప్రస్తుతం దీనికి పదునైన సంభాషణలను రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు మీద సాగుతున్నాయి. ఇందులో బాలకృష్ణ సరసన నటించే కథానాయికలు ఎవరన్నది త్వరలోనే వెల్లడవుతుంది.

- Advertisement -