‘మోనార్క్’గా బాలయ్య ..!

61
Hero Balakrishna

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా రోజుల కిందే లాంఛ్ అయ్యింది. కాగా ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’ ఆ తర్వాత ‘లెజెండ్’ మంచి విజయాన్ని పొందాయి. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఖరారు అయినట్టు సినీ వర్గాల సమాచారం. ‘మోనార్క్’ అనే పేరును ఫిల్మ్ ఛాంబర్​లో నమోదు చేశారని తెలుస్తోంది. వచ్చే నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దీనిని అఫిషియ‌ల్ గా ప్రకటించనున్నారట.

balakrishna

ఈ చిత్రంలో బాలకృష్ట రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఓ పాత్రలో అఘోరాగా దర్శనమివ్వనున్నారని బోయపాటి ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్లుగా, శ్రియ, అంజలి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరి పేరును ఫైన‌ల్ చెయ్య‌లేదు. ప్ర‌స్తుతం మంచి జోరుమీదున్న‌ తమన్ ఈ చిత్రానికి‌ సంగీతం అందిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ఫిల్మ్.. ఇదివరకే ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకున్నా, లాక్​డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.