బాలయ్య కొత్త చిత్రాల ముచ్చట్లు

27
- Advertisement -

భ‌గ‌వంత్ కేస‌రితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న బాల‌య్య‌, ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్ ఉంద‌ని, ఆ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టించ‌నున్నాడ‌ని ఇప్పటికే వార్త‌లొచ్చాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. మొద‌ట్లో ఈ పాత్ర కోసం సునీల్ శెట్టి పేరు వినిపించింది కానీ ఇప్పుడా స్థానంలోకి అనిల్ కపూర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ వార్త‌ల‌పై క్లారిటీ రానుంది.

మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కి వస్తే.. ప‌వ‌న్‌తో క్రిష్ చేస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాకు బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మ‌ళ్లీ మొద‌ల‌య్యే లోపే క్రిష్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిందని, ప్ర‌స్తుతం ఆ సిరీస్ కోసం క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే ప‌నిలో క్రిష్ ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బాలయ్య బాబు మెయిన్ లీడ్‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. వెబ్ సిరీస్ లో బాలయ్య అనేసరికి ఈ వార్త వైరల్ గా మారింది.

అన్నట్టు బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బాబీతో చేస్తున్న 109వ సినిమాను ఎలాగైనా ఎల‌క్ష‌న్స్ లోపు పూర్తి చేయాల‌ని చూస్తున్నారు బాల‌య్య‌. ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత బాల‌య్య త‌న 110వ సినిమాను బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే ఈ సినిమాకు అగ్రిమెంట్ జ‌రిగింద‌ని స‌మాచారం. ఇది అఖండ 2 అని టాక్.

Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

- Advertisement -