సీఎం రేవంత్‌తో బాలయ్య భేటీ

40
- Advertisement -

సీఎం రేవంత్‌తో టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. రేవంత్ నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవగా బాలయ్యతో పాటు ఆయన చిన్నల్లుడు భరత్ కూడా ఉన్నారు. ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి సైతం ఉండగా మీపాలన ఐదేళ్ల పాటు సాగాలని ఆకాంక్షించారు బాలయ్య. ఇక అనంతరం క్రీడాకారిణి పీవీ సింధు సైతం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు.

ఇక ఇప్పటికే సినీ రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి,నాగార్జు-అమల తదితరులు సీఎం రేవంత్‌ని కలిసిన సంగతి తెలిసిందే.

Also Read:ప్రియమైన వారి ‘లైఫ్ లొకేషన్’ తెలుసుకోండిలా!

- Advertisement -