సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పుడో ఎదో వివాదంతో హైలెట్ అవుతారు. తాజాగా జరిగిన సంఘటనతో బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన గత మూడు రోజుల నుంచి పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈకార్యక్రమంలో భాగంగా ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోకి వెళ్లి వాళ్ల బాగోగులు తెలుసుకుంటున్నారు.
బాలకృష్ణ చేపట్టిన ఈకార్యక్రమంలో చాలా మంది అభిమానులు ఆయన వెంట పర్యటిస్తున్నారు. బాలకృష్ణ తమ వద్దకు రావడంతో మహిళలు ఆయనకు కరచాలనం చేస్తున్నారు. కరచాలనం చేస్తోన్న సమయంలో ఆయన వేలుకి ఉన్న ఉంగరం ఉడిపోయి ఎక్కడో పడిపోయింది. ఉంగరం ఉడిపోయిన విషయాన్ని బాలకృష్ణ కూడా గమనించలేదు.
ఆ తర్వాత ఓ మహిళకు ఉంగరం కనిపించడంతో తీసుకుని బాలకృష్ణ వేలికి తొడిగింది. పోయిన ఉంగరాన్ని ఆ మహిళ మళ్లి తిరిగి ఇవ్వడంతో ఆ నిజాయితికి బాలకృష్ణ ఎంతో సంతోషపడ్డారు.ఈసందర్భంగా బాలకృష్ణ వెంట ఉన్న పలువురు నేతలు ఆ మహిళ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.