ఓహో.. జాంబవంతుడి కథలో బాలయ్య

20
- Advertisement -

ప్రశాంత్‌ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌ లో తెరకెక్కిన హను మాన్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ పై సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీ5 ఓటీటీ సంస్థ ఈ సినిమా ఫిబ్రవరి మూడో వారంలో స్ట్రీమింగ్‌ చేయాలని అనుకున్నారు. కానీ, నిర్మాతలు మార్చి ఆఖరి వారంలో స్ట్రీమింగ్‌ చేయమన్నట్లు టాక్. మొత్తానికి ఓటీటీలోకి హను మాన్ ఆలస్యంగా రాబోతుంది.

సంక్రాంతి కానుకగా తేజ సజ్జా, అమృత అయ్యర్ నటించిన ఈ ‘హను-మాన్’చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. దీనిని ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా ఈ చిత్రాన్ని చూసినట్టు తెలుస్తోంది. ఈ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారట. మరోవైపు బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ షో’కు ప్రోమోలు చేసింది కూడా ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మనే కావడం విశేషం.

పైగా ప్రశాంత్ వర్మ – బాలయ్య బాబు కలయికలో ఓ సినిమా రాబోతుంది. ‘హను-మాన్’ సినిమాను తిలకించిన బాలకృష్ణ తన కోసం కూడా ఓ పవర్ ఫుల్ కథ తయారు చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. జాంబవంతుడి కథ నేపథ్యంలో ఓ కథ తన దగ్గర ఉందని.. పైగా జాంబవంతుడి కథకు బాలయ్య పెర్ఫెక్ట్ గా సెట్ అవుతారని, బాలయ్య కూడా ఈ కథ పై ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తోంది.

Also Read:తెలంగాణలో గోద్రెజ్ రూ.1000 పెట్టుబడులు

- Advertisement -